అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Marriage Cancel | ఒక సంపన్న కుటుంబానికి చెందిన 27 ఏళ్ల యువకుడి వివాహం Marriage విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆస్తిపాస్తులు బాగా ఉన్న ఈ యువకుడు, నెలకు రూ.50 లక్షలకుపైగా ఆదాయం సంపాదిస్తూ బీఎండబ్ల్యూ కారు (BMW Car) నడుపుతున్నాడట.
అంతేగాక, కుటుంబానికి రియల్ ఎస్టేట్ (Real Estate), హోటల్ వ్యాపారాలు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ యువకుడు ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలూ పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ కట్నం విషయంలో ఏర్పడిన సమస్య అతడి కలలను కూల్చేసింది. వధువు తండ్రి, పెళ్లి కట్నంగా డూప్లెక్స్ ఫ్లాట్, రేంజ్ రోవర్ కారును ఇస్తానని అన్నాడు. అదనంగా ఏవైనా కావాలంటే అడగమని కూడా చెప్పాడు.
Marriage Cancel | ఇదో కొత్త సమస్య..
యువకుడు కట్నం ఆఫర్‌ను (Dowry Offer) సున్నితంగా తిరస్కరించడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. కట్నం అడగనందుకు సంతోషించాలి కాని వధువు తండ్రి వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేశాడట. అతడు కట్నం వద్దంటున్నాడంటే ఏదో లోపం ఉన్నట్టే. ఉన్నత వ్యక్తులకు తమ విలువపై స్పష్టమైన అంచనా ఉంటుంది. వీవో, షావొమీ ఫోన్లు రూ.20 వేలకే వస్తుంటాయి. కానీ జనాలు లక్షలు పోసి ఐఫోన్‌లు కొనుగోలు చేస్తున్నందుకు కారణం ఇదే’ అని రివర్స్ లాజిక్ ప్రయోగించడంతో వరుడి కుటుంబానికి మైండ్ బ్లాక్ అయింది. ఇక ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో పెళ్లి రద్దయ్యింది. ఈ ఘటనను యువకుడి బంధువు రెడిట్‌లో షేర్ చేయడంతో విషయం వైరల్ అయింది. నెటిజన్లు వధువు తండ్రిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
కొంతమంది అభిప్రాయాల ప్రకారం.. కట్నం ఇచ్చాక వధువు కుటుంబం (bride Family) వరుడి కుటుంబాన్ని ఆస్తి కోసం బలవంతంగా ఒత్తిడి చేస్తోందని అనుమానిస్తున్నారు. మరికొందరు, “అదే కట్నం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని” అభిప్రాయపడుతున్నారు.. ఈ సంఘటన సామాజిక చర్చలకు కొత్త దారితీస్తోందని, పెళ్లిళ్లలో కట్నం అలవాట్లపై సమాజం మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.