HomeజాతీయంKarnataka | కర్ణాటకలో కొనసాగుతున్న బ్రేక్​ఫాస్ట్​ రాజకీయాలు.. సీఎం పదవి మార్పుపై ఉత్కంఠ

Karnataka | కర్ణాటకలో కొనసాగుతున్న బ్రేక్​ఫాస్ట్​ రాజకీయాలు.. సీఎం పదవి మార్పుపై ఉత్కంఠ

కర్ణాటకలో బ్రేక్​ఫాస్ట్​ రాజకీయాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం ఇంటికి సీఎం సిద్ధరామయ్య అల్పాహార మీటింగ్​ కోసం వెళ్లారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి మార్పు సస్పెన్స్​ వీడటం లేదు. ఈ క్రమంలో బ్రేక్​ఫాస్ట్ రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (Deputy CM DK Shivakumar) ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం వచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ కోసం ఆయన వెళ్లారు. ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ రాజకీయాలు నడుస్తున్న వేళ బ్రేక్ ఫాస్ట్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అప్పటి నుంచే పవర్ షేరింగ్ పంచాయితీ మొదలైంది. మిగతా రెండున్నరేళ్లు డీకే. శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకు శనివారం డీకే.శివకుమార్​ను సీఎం బ్రేక్ ఫాస్ట్​కు ఆహ్వానించారు. తాజాగా డీకే తన ఇంటికి సీఎంను అల్పాహారం కోసం ఆహ్వానించారు.

Karnataka | విబేధాలు లేవని స్పష్టం

ఇటీవల సీఎం (CM Siddaramaiah) ఇంట్లో బ్రేక్​ఫాస్ట్​ అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు ఇటీవల వ్యాఖ్యలు చేసిన పరమేశ్వర తాజాగా వెనక్కి తగ్గారు. నాయకులు అల్పాహారం కోసం మళ్ళీ కలిసి రావడం మంచి విషయమన్నారు. గత నెల రోజులుగా జరిగిన దానికి శాంతియుత పరిష్కారం కావాలి అని పేర్కొన్నారు.

Must Read
Related News