HomeUncategorizedPeddi movie shooting | పెద్ది సినిమా షూటింగ్‌కి బ్రేక్.. లండ‌న్‌లో వాలిన మెగా ఫ్యామిలీ.....

Peddi movie shooting | పెద్ది సినిమా షూటింగ్‌కి బ్రేక్.. లండ‌న్‌లో వాలిన మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే..!

- Advertisement -

Peddi movie shooting : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ Ram Charan న‌టిస్తున్న తాజా చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది. పెద్ది సినిమా నుంచి ఇటీవలే గ్లింప్స్ రిలీజై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంతో రామ్ చర‌ణ్ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయం అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది.

Peddi movie shooting | పెద్ది సినిమా షూటింగ్‌కి బ్రేక్.. లండ‌న్‌లో వాలిన మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే..!
Peddi movie shooting | పెద్ది సినిమా షూటింగ్‌కి బ్రేక్.. లండ‌న్‌లో వాలిన మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే..!

ఈ సినిమాలో ఎన్టీఆర్ NTR తో చేసిన నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్ లో మే 9న ఆవిష్క‌రించ‌నున్నారు. గతేడాది రామ్ చరణ్ , రైమ్‌కు సంబంధించిన కొలతలను కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించనుండ‌డంతో ఆ దృశ్యాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని చిరు, సురేఖలతో పాటు భార్య ఉపాసన, కూతురు క్లీంకారా లండన్ వెళ్లారు. రామ్ చ‌ర‌ణ్‌కి ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం ప‌ట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి గౌరవం అందుకుంటున్న నాల్గో కథానాయకుడిగా రామ్ చరణ్ రికార్డులకు ఎక్కాడు. దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి ముందుగా ప్రభాస్ Prabhas మైనపు విగ్రహాన్ని బాహుబలి రూపంలో సింగపూర్ లో పెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక‌ లండన్ లో అల్లు అర్జున్ పుష్ప గెటప్ లో మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువు దీరింది. ఈ మైనపు విగ్రహంలో రామ్ చరణ్ పెంపుడు కుక్క కూడా ఉండడం విశేషం. ఇలా పెట్ తో ఓ సెలబ్రిటీ మైనపు విగ్రహాన్ని పెట్టడం ఇదే తొలిసారి. దీనిపై రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Must Read
Related News