అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ (Brahmanapalli Sarpanch) శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి (Mla Bhupathi Reddy) క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో (Gram Panchayat general elections) స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందిన శివప్రసాద్‌తో పాటు యూత్ సభ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నమ్మకాన్ని కలిగించాయని కాంగ్రెస్‌లో చేరడానికి కారణమని వారు తెలిపారు.
Mla Bhupathi Reddy | కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
డిచ్పల్లి మండలం (Dichpally mandal) కమలాపూర్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ ఛైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ రామచందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు టి.సాగర్, పవన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.