అక్షరటుడే, కోటగిరి : Pothangal | కుక్కల దాడిలో బాలుడు గాయపడ్డాడు. ఈ ఘటన పోతంగల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన లిఖిత్ చంద్ర(4) ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. కాలనీవాసులు గమనించి కుక్కలను తరిమేశారు. దీంతో ప్రమాదం తప్పింది. గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
గ్రామంలో కుక్కల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై కుక్కలు దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. గుంపులుగా తిరుగుతుండటంతో పెద్దలు సైతం వాటిని చూస్తే భయపడుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారించాలని ప్రజలు కోరుతున్నారు.