అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Peddapalli District | బుడి బుడి అడుగులతో ఆడుకుంటున్న ఆ చిన్నారిని పుట్టిన రోజు నాడే విధి బలి తీసుకుంది. తమ కుమారుడి కోసం ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులకు దేవుడు తీరాన్ని శోకం మిగిల్చాడు. వేడి సాంబారులో పడి ఓ బాలుడు మృతి చెందాడు.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం (Mallapur Village)లో గురుకుల పాఠశాల ఉంది. ఇందులో మంచిర్యాల జిల్లా కోటపల్లి గ్రామానికి చెందిన మొగిలి మధుకర్ వంట మనిషిగా పని చేస్తున్నాడు. భార్య శారద, కూతురు శ్రీమహి, కుమారుడు మోక్షిత్‌తో కలిసి బడిలోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. శారద కుంట బడిలో పని చేస్తుంటుంది.నిత్యం బాలుడు తల్లిదండ్రులతో పాటే ఉంటాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం పాఠశాలలో వంట చేస్తున్న తండ్రితో వెళ్లి, ప్రమాదవశాత్తు సాంబారులో పడిపోయాడు.
Peddapalli District | చికిత్స పొందుతూ..
తీవ్ర గాయాలపాలైన తల్లిదండ్రులు బాలుడిని కరీంనగర్ ఆసుపత్రి (Karimnagar Hospital)కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి (Warangal MGM Hospital)కి తరలించగా చికిత్స సోమవారం పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే బాలుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటనతో పాఠశాలతో పాటు సుధాకర్ స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Peddapalli District | కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుంటుబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ (SI M. Praveen Kumar)తెలిపారు. కాగా గతంలో సైతం పలు బడుల్లో ఇలాగే పిల్లలు వంట పాత్రల్లో పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా వేడి వేడి సాంబారు, కూరల్లో పడి గాయపడిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో హాస్టళ్లు, బడుల్లో పని చేసే వారు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వంట పాత్రలపై మూతలు పెట్టి ఉంచాలి. పిల్లలను వీలైనంత వరకు వంటి గదిలోని రానివ్వొద్దు.