అక్షరటుడే, భీమ్‌గల్ : Boxing Coach | మండల కేంద్రానికి చెందిన యువరైతు, బాక్సింగ్ అకాడమీ కోచ్ కనూర్ సంజీవ్‌ను ప్రతిష్టాత్మక ‘అలోక్ నేషనల్ ప్రీమియర్ అవార్డు’ (Alok National Premier Award) వరించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒక తెలుగు లఘు చిత్రంలో కనబర్చిన అద్భుత నటనకు గాను ఆయనకు ‘ఉత్తమ నటుడు’ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం అకాడమీలో ఆయనను ఘనంగా సన్మానించారు.
అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్ (Dr. Srikanth Ramawat) మాట్లాడుతూ.. సంజీవ్ బాక్సింగ్‌లోనే కాకుండా అంకితభావం గల కార్యకర్తగా, రైతుగా, నటుడిగా రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞను చాటుకోవడం గర్వకారణమన్నారు. క్రీడలతో పాటు కళారంగంలోనూ ప్రతిభ చాటుతూ యువతకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో అకాడమీ సభ్యులు, క్రీడాకారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.