Homeజిల్లాలుకామారెడ్డిBanswada Mandal | బోర్లం జడ్పీహెచ్​ఎస్​కు హరిత స్వచ్ఛతలో 5-స్టార్ రేటింగ్.. కలెక్టర్ చేతుల మీదుగా...

Banswada Mandal | బోర్లం జడ్పీహెచ్​ఎస్​కు హరిత స్వచ్ఛతలో 5-స్టార్ రేటింగ్.. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం

బాన్సువాడ మండలంలోని బోర్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mandal | బాన్సువాడ మండలంలోని బోర్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Borlam Zilla Parishad High School) జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Union Education Ministry) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛత ఏవం హరిత విద్యాలయ రేటింగ్–2025’లో ఈ పాఠశాల 94.40 శాతం స్కోర్ సాధించి 5 స్టార్ రేటింగ్​ను కైవసం చేసుకుంది.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట రమణకు ప్రశంసాపత్రం అందించి అభినందించారు. పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం, హరిత వాతావరణ సృష్టి, శుద్ధి చేసిన తాగునీటి సదుపాయం, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో పాఠశాల చూపిన కట్టుదిట్టమైన అమలు విధానం ఈ రేటింగ్‌ను అందుకునేలా చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పీఈటీ శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Must Read
Related News