Homeజిల్లాలునిజామాబాద్​Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బోనాలు

Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బోనాలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతిరూపమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. శుక్రవారం నగరంలోని మహాలక్ష్మి నగర్​లో (Mahalaxmi Nagar) బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు బోనాలను తలపై పెట్టుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

Bonalu Festival | సమాజంలో శాంతి.. సౌభాగ్యం కోసం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సౌభాగ్యం, శాంతిని కలగజేయాలని భావనతో గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని దేవతలను వేడుకున్నట్లు తెలిపారు.

Bonalu Festival | తెలంగాణకు ప్రత్యేకం..

బోనాల పండుగ అనేది తెలంగాణకు ప్రత్యేకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలుస్తూ.. తమ పిల్లాపాపలను కాపాడాలని ప్రజలు మొక్కుకుంటారని.. దీంట్లో భాగంగానే బోనాలు తీస్తారని ఆయన వివరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లావణ్య లింగం, లక్ష్మీ సిల్క్స్ అధినేత శీతల్, బీజేపీ నాయకులు, మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణకు స్వాగతం పలుకుతున్న మహాలక్ష్మినగర్​ కాలనీవాసులు

మహిళలకు నమస్కరిస్తున్న ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా

Must Read
Related News