HomeజాతీయంBomb Threat | మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

Bomb Threat | మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

శంషాబాద్‌ వస్తున్న రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి నకిలీ బెదిరింపుగా గుర్తించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Bomb Threat | విమానాలకు బాంబు బెదిరింపులకు ఆగడం లేదు. ఇప్పటికే ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో నకిలీ బాంబు (Fake Bomb) బెదిరింపులు రావడంతో మరింత అసహనానికి లోనవుతున్నారు.

దేశంలో ఐదు రోజులుగా ఇండిగో విమానాలు (Indigo Flights) సరిగ్గా నడవడం లేదు. సాంకేతిక కారణాలు, ఫైలెట్ల కొరత వంటి కారణాలతో వందలాది విమానాలను ఇండిగో రద్దు చేసింది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇతర విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపులు రావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Bomb Threat | ఎమర్జెన్సీ ల్యాండింగ్​

శంషాబాద్‌ (Shamshabad) వస్తున్న మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కువైట్‌ నుంచి శంషాబాద్‌ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అత్యవసరంగా విమానాన్ని మస్కట్‌ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. లండన్‌ నుంచి శంషాబాద్ వస్తున్న బ్రిటీష్‌ ఎయిర్‌లైన్స్‌ (British Airlines)కు బాంబు బెదిరింపు వచ్చింది. దీనిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అధికారులు ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి బెదిరింపులతో ప్రయాణికులతో పాటు, అధికారుల సమయం వృథా అవుతోంది.

Bomb Threat | కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

ఇండిగో ఎయిర్​లైన్స్​ సంక్షోభం కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్​కు రావాల్సిన 26 ఇండిగో విమానాలను శనివారం అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సిన 30 ఫ్లైట్లు సైతం రద్దయినట్లు అధికారులు తెలిపారు.

Must Read
Related News