అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bomb Threat | హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం (డిసెంబర్ 8) బాంబు బెదిరింపు అలజడి రేపింది. కన్నూర్, ఫ్రాంక్‌ఫర్ట్, లండన్ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు రానున్న మూడు విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇండిగో 6E 7178, లుఫ్తాన్సా LH-752, బ్రిటిష్ ఎయిర్‌వేస్ సేవలకు ఈ బెదిరింపులు వచ్చాయి. అయినప్పటికీ మూడు ఫ్లైట్‌లు సురక్షితంగా ల్యాండయ్యాయి.విమానాలు ల్యాండింగ్ అయిన వెంటనే, భద్రతా సిబ్బంది ప్రయాణికులను తక్షణమే బయటకు దించి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.
Bomb Threat | మూడు విమానాలకి బెదిరింపు కాల్స్..
అనంతరం బాంబు స్క్వాడ్ (Bomb Squad) బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా, ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. అయితే, భద్రతా తనిఖీలు ఇంకా కొనసాగుతుండటంతో విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో అప్రమత్త పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో CISF, పోలీసులు, విమానయాన సంస్థలు, NSG వంటి భద్రతా సంస్ధలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అత్యవసర చర్యల కారణంగా విమానాశ్రయంలోని ఇతర విమానాల రాకపోకల్లో స్వల్ప ఆలస్యం చోటుచేసుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రయాణికులు తమ విమాన సమయాలను ముందస్తుగా ధృవీకరించుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.
అయితే బాంబు బెదిరింపు సమయంలో ప్రయాణికులు (Passengers) అంతా భయబ్రాంతులకి గురయ్యారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కూడా లేకపోవడంతో అవి ఫేక్ మెయిల్స్‌గా సమాచారం. అయితే బెదిరింపు మెయిల్స్‌ను ఎవరు పంపారు, దీని వెనుక ఉద్దేశం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం మనం చూశాం. ఇలాంటి కాల్స్, మెయిల్స్‌తో ప్రజలని ఆందోళనకి గురి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.