అక్షరటుడే, వెబ్డెస్క్ : Bomb Threat Call | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఇటీవల ఎర్రకోట వద్ద కారు బాంబు పేలి 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ఉగ్రవాదులను (Terrorists) కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat Call) రావడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఢిల్లీలోని పలు కోర్టులు, విద్యాసంస్థల లక్ష్యంగా కొందరు దుండగులు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. 4 కోర్టులు, రెండు సీఆర్పీఎఫ్ సూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాకేత్, రోహిణి, ద్వారక, పాటియాలా కోర్టులకు బెదిరింపులు రావడంతో సిబ్బంది, లాయర్లు బయటకు వచ్చారు. అనంతరం డాగ్ స్క్వాడ్ (Dog Squad), బాంబు స్క్వాడ్ (Bomb Squad) తో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు దృష్ట్యా సాకేత్ కోర్టు బార్ కార్యదర్శి న్యాయవాది అనిల్ బసోయా మాట్లాడుతూ, కోర్టు పనిని రెండు గంటల పాటు నిలిపివేసినట్లు తెలిపారు.
Bomb Threat Call | పాఠశాలలకు..
దేశ రాజధానిలోని రెండు CRPF పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల తర్వాత కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. ప్రశాంత్ విహార్ మరియు ద్వారకలోని CRPF పాఠశాల (CRPF Schools) ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR)కి ఫోన్ చేసి పేర్కొన్నాడు. దీంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను బయటకు పంపి బాంబ్స్క్వాడ్తో తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. దీంతో ఇవి నకిలీ బెదిరింపులని అధికారులు తేల్చారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
