అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bomb Threat | శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport)కు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో రోజు విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)కు మంగళవారం అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు అమర్చారని పేర్కొంటూ మరో బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మెయిల్ పంపిన వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు చెల్లించకపోతే విమానాన్ని పేల్చివేస్తామని హెచ్చరించాడు. దీంతో సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే చర్య తీసుకున్నారు, టెర్మినల్, కార్గో జోన్లు, పార్కింగ్ ప్రాంతాలు షెడ్యూల్ చేయబడిన అన్ని విమానాలలో తీవ్రమైన తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణికులను అదనపు భద్రతా స్క్రీనింగ్‌కు గురిచేశారు.
Bomb Threat | యూఎస్ నుంచి..
యునైటెడ్ స్టేట్స్ (United States)లోని న్యూయార్క్ నగరానికి చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబ్ ఉందంటూ మెయిల్ పంపినట్లుగా అధికారులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు (Cybercrime Police) ఇమెయిల్ మూలం, ప్రామాణికతను గుర్తించడం ప్రారంభించాయి. తనిఖీలలో ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
Bomb Threat | కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం
దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. గతంతో పోలిస్తే విమానాల రద్దు సంఖ్య తగ్గింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి. కాగా మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 14 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలను రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్పైస్‌జెట్ వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది.