అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతానికి బెదిరింపు మెయిల్స్, కాల్స్ (mails and calls) వస్తున్నాయి. దీంతో అధికారులు, ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇందులో చాలా వరకు నకిలీ బెదిరింపులు (fake threats) ఉంటున్నాయి.
ఇండిగో విమానానికి తాజాగా బాంబు బెదిరింపు మెయిల్ (bomb threat mail) వచ్చింది. ఫ్లైట్ సోమవారం అర్ధరాత్రి 1:30 గంటలకు కువైట్ నుంచి బయలు దేరింది. మంగళవారం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో మానవ బాంబు ఉందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మిమానాన్ని అత్యవసరంగా ముంబైలో (Mumbai) ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలియడంతో ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు.
Bomb Threat | విమానంలో తనిఖీలు
విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (emergency landing) చేసిన అనంతరం అధికారులు ప్రయాణికులను దింపేశారు. ప్రయాణికులను తనిఖీ చేశారు. విమానంలో బాంబ్‌స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపుగా అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో ఇటీవల నకిలీ బాంబు బెదిరింపులు పెరిగాయి. పాఠశాలలు, విమానాలు సహా ప్రజా సౌకర్యాలను లక్ష్యంగా కొందరు నకిలీ మెయిల్స్ పంపుతున్నారు. ఇటీవల పలు కోర్టులకు సైతం బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రజలు, అధికారుల సమయం వృథా అవుతోంది. థానే జిల్లాలోని మీరా రోడ్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు సోమవారం ఇలాంటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఇలాంటి నకిలీ మెయిల్స్‌తో అత్యవసర వనరులను వృథా చేయడమే కాకుండా సేవలకు అంతరాయం, ఆందోళనను కలిగిస్తుంది. భారత అధికారులు ఈ బెదిరింపుల మూలాలను పరిశీలిస్తున్నారు.
