CP Nizamabad | బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితుల అరెస్ట్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Nizamabad | పేద, మధ్యతరగతి ప్రజలను మోసగించిన బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్​ 13న కోటగల్లీలోని కెనరా బ్యాంక్​ పక్కన ఉన్న బీఎంబీ కంపెనీని (BMB Company) చూసిన ఫిర్యాదుదారు తోకల బక్కన్న కంపెనీని సందర్శించాడు. ఆ కంపెనీ ప్రతినిధులు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Nizamabad | పేద, మధ్యతరగతి ప్రజలను మోసగించిన బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అక్టోబర్​ 13న కోటగల్లీలోని కెనరా బ్యాంక్​ పక్కన ఉన్న బీఎంబీ కంపెనీని (BMB Company) చూసిన ఫిర్యాదుదారు తోకల బక్కన్న కంపెనీని సందర్శించాడు. ఆ కంపెనీ ప్రతినిధులు సదరు కంపెనీ ఇంగ్లాండ్​ దేశానికి చెందినదని.. దీంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్​కు రేటింగ్​ ఇవ్వడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. దీంతో బాధితుడు కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్​ ప్రసాద్​ మాటలు నమ్మి యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుని అందులో సుమారు రూ.84వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అలాగే మరి కొంతమందిని సైతం ఈ మల్టీలెవల్​ మార్కెటింగ్​ చైన్​ సిస్టమ్​ కంపెనీలో చేర్పించాడు. అయితే తాను పెట్టిన పెట్టుబడి, లాభాలు విత్​డ్రా కాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బక్కన్న వెంటనే స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు సైబర్​ క్రైం (Cyber ​​Crime) కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం గురువారం మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో సదరు బీఎంబీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

CP Nizamabad | రూ.కోటికి పైగా పెట్టుబడులు..

సదరు నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసిందని సీపీ తెలిపారు. అయితే చైన్​ స్టిస్టం ద్వారా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసిందన్నారు. బాధితులు బీఎంబీ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ రూ. కోటికి పైగా ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం బీఎంబీ కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదన్నారు. కంపెనీ పంపిన లింకులన్నీ కూడా చైనా బేస్డ్ లింకులని ఆ లింక్​ల ద్వారా పంపిన రూ.1.50 కోట్లు చైనా బేస్డ్ లింక్​లకు డైవర్ట్ అయినట్లు సమాచారం ఉందన్నారు.

CP Nizamabad | మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు..

మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులు కావొద్దని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఎవరు కూడా ఇలాంటి మోసపూరిత మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ (Multi-Level Marketing) చైన్ సిస్టంలో లాభాలు వస్తాయని పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి సంస్థల్లో మోసపోయి ఉంటే స్థానిక పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...