అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం(War) ముగించాలన్న పట్టుదలతో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆంక్షల బిల్లును తీసుకురావాలని నిర్ణయించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా, బ్రెజిల్‌లపై సుంకాలను 500 శాతం పెంచేందుకు అవకాశం ఉంటుంది. దీంతో స్టాక్ మార్కెట్లు కుదుపులకు లోనవుతున్నాయి.
గురువారం ఉదయం సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా 187 పాయింట్లు పెరిగి లాభాల బాటపడుతున్నట్లు కనిపించింది. అయితే ట్రంప్ టారిఫ్‌ల భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి సెన్సెక్స్ 855 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 275 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్(Sensex) 780 పాయింట్ల నష్టంతో 84,180 వద్ద, నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 25,876 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | ఎరుపెక్కిన సూచీలు..
అన్ని రంగాలు సెల్లాఫ్‌కు గురయ్యాయి. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్(Metal index) 3.34 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 3.15 శాతం, పవర్ 2.92 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 2.71 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 2.64 శాతం, కమోడిటీ 2.36 శాతం, ఇండస్ట్రియల్ 2.36 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.31 శాతం, పీఎస్‌యూ 2.27 శాతం, ఐటీ ఇండెక్స్ 2.04 శాతం, యుటిలిటీ 2 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.99 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.97 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.21 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,039 కంపెనీలు లాభపడగా 3,158 స్టాక్స్ నష్టపోయాయి. 170 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 113 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 189 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 4 కంపెనీలు లాభపడగా.. 26 కంపెనీలు నష్టపోయాయి. ఎటర్నల్ 0.91 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.48 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.29 శాతం, బీఈఎల్ 0.01 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఎల్‌టీ 3.35 శాతం, టెక్ మహీంద్రా 2.92 శాతం, టీసీఎస్ 2.74 శాతం, రిలయన్స్ 2.25 శాతం, టాటా స్టీల్ 1.93 శాతం నష్టపోయాయి.