అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad CP | రక్తదానం మహాదానమని.. ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పోలీస్ శాఖ (Armor Police Department) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు.
రక్తదానం చేసిన యువకులు, పోలీసులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో రక్తదానం అత్యవసరమైందన్నారు. ఒకరి రక్తదానం (Blood donation) మరొకరి ప్రాణాలను నిలబెడుతుందన్నారు. పోలీసుల చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు వారం రోజుల పాటు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత పెద్ద ఎత్తున రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

