Homeజిల్లాలునిజామాబాద్​Blood donation | రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు: సీపీ సాయిచైతన్య

Blood donation | రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు: సీపీ సాయిచైతన్య

రక్తదానం ఎంతోమంది ప్రాణదానం అవుతుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లోభాగంగా బుధవారం రక్తదానం శిబిరాన్ని సీపీ ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Blood donation | రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని (blood donation camp) పోలీసు కమిషనర్ ప్రారంభించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ.. సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందన్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవల్లో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటంలో తమ వంతు సాయం చేయాలన్నారు. రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమమన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్తదానo చేసిన వారికి పోలీస్ కమిషనర్ (Police Commissioner) హెల్మెట్లు ప్రదానం చేశారు.

ఈ రక్తదాన శిబిరంలో అదనపు డీసీపీ(ఏఆర్) రామ్ చందర్ రావ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, పోలీస్ యునిట్ ఆఫీసర్ సరళ, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్​ సతీష్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ, సీఐలు, ఎస్సైలు, మోక్ష్​ డ్రెస్సెస్ యాజమాన్యం ప్రవీణ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా, ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది, పోలీస్ యునిట్ ఆస్పత్రి సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.