Homeజిల్లాలునిజామాబాద్​Banswada BJP | దేశాభివృద్ధి కోసమే సంక్షేమ పథకాల అమలు

Banswada BJP | దేశాభివృద్ధి కోసమే సంక్షేమ పథకాల అమలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పలువురు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada BJP | ప్రధాని మోదీ (PM Modi) ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్ తిరిగి బీజేపీలో చేరగా.. గురువారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన నాయకుడు పీఎం నరేంద్ర మోదీ అని కొనియాడారు.

రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతారని సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ రూరల్ అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదర్ సాయిలు, కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, హనుమాన్ యాదవ్, హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, దత్తు, సీనియర్ నాయకులు సాయిబాబా, దత్తు సాయి రెడ్డి, లక్ష్మణ్, సురేష్, సంజీవ్, విశ్వనాధ్, విఠల్ రాజిరెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.