Homeజిల్లాలుకామారెడ్డిBJP MPs | వ‌ర‌ద బాధితుల‌కు బీజేపీ ఎంపీల విరాళం.. ఎంపీ లాడ్స్ నుంచి రూ.10...

BJP MPs | వ‌ర‌ద బాధితుల‌కు బీజేపీ ఎంపీల విరాళం.. ఎంపీ లాడ్స్ నుంచి రూ.10 ల‌క్ష‌ల చొప్పున కేటాయింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP MPs | భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో (Heavy Rains And floods) తీవ్రంగా న‌ష్ట‌పోయిన బాధితులకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు (BJP MPs) అండ‌గా నిలిచారు. త‌మ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 ల‌క్ష‌ల చొప్పున వ‌ర‌ద బాధితుల కోసం కేటాయించారు. గ‌త వారం భారీ వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లు పోటెత్తిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ధానంగా కామారెడ్డి (Kamareddy), మెద‌క్ జిల్లాలు (Medak District) అతలాకుత‌ల‌మ‌య్యాయి. పంట‌ల‌తో పాటు ఇళ్లు, రోడ్లు, ఇత‌ర ఆస్తులకు భారీ న‌ష్టం వాటిల్లింది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి చెందిన ఎంపీలు వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఇద్ద‌రు కేంద్ర మంత్రులు కిష‌న్‌రెడ్డి (Union Ministers Kishan Reddy), బండి సంజ‌య్‌తో (Bandi Sanjay) పాటు మిగ‌తా ఆరుగురు ఎంపీలు సాయం ప్ర‌క‌టించారు. త‌మ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 ల‌క్ష‌ల చొప్పున మొత్తం రూ.80 ల‌క్ష‌లు కేటాయించారు.

BJP MPs | ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేందుకు..

విపత్కర పరిస్థితుల్లో ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిన సందర్భంలో, బీజేపీ ఎంపీలు తక్షణమే ముందుకు వచ్చి సహాయక చర్యల కోసం నిధులను కేటాయించడం ప్ర‌శంస‌నీయ‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ram Chander Rao) అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భరోసాగా త‌మ పార్టీ ఎంపీలు నిలబడ్డారన్నారు.

తెలంగాణలో వరద నష్టం రిలీఫ్ చర్యల్లో భాగంగా ఎంపీల ఉదార సాయం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉండడం మా కర్తవ్యమ‌ని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా బీజేపీ ముందుండి తోడ్పడుతుందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో బీజేపీ ప్రజా హితం కోసం పనిచేస్తుందన్న రాంచంద‌ర్‌రావు.. ప్రజల పక్షాన నిలబడేది బీజేపీ మాత్రమే అన్నది మరోసారి రుజువైందని తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉండటం, సహాయక చర్యల్లో పాల్గొనడం త‌మ బాధ్యత అని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.