అక్షరటుడే, డిచ్పల్లి: Madhavanagar ROB | మాధవనగర్ గేట్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్వోబీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachary) మాట్లాడుతూ.. రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway overbridge) పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఆర్వోబీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.10 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Madhavanagar ROB | కేంద్రం సహకరిస్తున్నా..
అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడడం ఎంతవరకు సబబని దినేష్ కులాచారి ప్రశ్నించారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి (Mla sudhrshan reddy), డాక్టర్ భూపతి రెడ్డి (Mla Bhupathi reddy), పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Pcc Chief Bomma), సలహాదారుడు షబ్బీర్ అలీ నిధులు మంజూరు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాధవనగర్ రైల్వే వంతెనతో పాటు అర్సపల్లి, అడవి మామిడిపల్లి వంతెనలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నక్క రాజేశ్వర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
