అక్షరటుడే, వెబ్‌డెస్క్: BMC Results | మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో (Maharashtra municipal elections) అధికార బీజేపీ, శివసేన కూటమి జోరు కొనసాగింది. కీలకమైన బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ మార్క్‌ను దాటింది.
ముంబై మున్సిపల్ ఎన్నికలు (Mumbai municipal elections) గురువారం జరిగాయి. బీఎంసీలో 227 స్థానాలకు 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. సాయంత్రం వరకు బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి 114 స్థానాల మెజారిటీ మార్కును దాటింది. బీఎంసీ ఫలితాల లెక్కింపు కొనసాగుతుండగా, లెక్కింపులో, ఈవీఎంలలో లోపాల కారణంగా కనీసం రెండు వార్డుల ఫలితాలను నిలిపివేశారు.
BMC Results | పూర్తి మెజారిటీ సాధిస్తాం
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) మాట్లాడుతూ.. పూర్తి మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం 6:30 గంటల వరకు 121 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. అందులో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. మహాయుతి కూటమి గెలుపుతో కలిపి 120కి పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది. ముంబై అభివృద్ధికి ప్రజాతీర్పు ఇవ్వబడిందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పేర్కొన్నారు.
BMC Results | నాలుగేళ్లు ఆలస్యంగా..
నాలుగేళ్ల జాప్యం తర్వాత గురువారం జరిగిన బీఎంసీ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికలు 2017లో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు 2022లో జరగాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణాలలో కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) ఒకటి. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒంటరిగా ఓటీ చేశాయి. అయితే ఫలితాల అనంతరం శివసేనతో కలిసి బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. తాజాగా శివసేన (సిందే)తో కలిపి మరోసారి అధికారం దిశగా సాగుతోంది. దీంతో కాషాయ శ్రేణుల్లో జోష్ నెలకొంది.