అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nara Lokesh | తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ ఈ రోజు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సోషల్ మీడియా (Social Media) నుంచి స్థానిక కార్యక్రమాల వరకు ఎక్కడ చూసినా లోకేష్ పుట్టినరోజు సందడి కనిపిస్తోంది. అయితే ఈ శుభాకాంక్షల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆయన భార్య నారా బ్రహ్మణి చేసిన హృదయపూర్వక పోస్ట్. X (ట్విట్టర్) వేదికగా బ్రాహ్మణి (Nara Brahmani) చేసిన ఈ స్పెషల్ బర్త్‌డే విషెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ జీవితంలో లోకేష్ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయన చూపుతున్న సహనం, నిబద్ధతను గుర్తు చేస్తూ బ్రాహ్మణి భావోద్వేగంగా స్పందించారు.
Nara Lokesh | శుభాకాంక్షల వెల్లువ
“నా శక్తి, నా శాంతి @naralokeshకు హ్యాపీ బర్త్‌డే! మీరు ఎదుర్కొన్న రోజులు, త్యాగాలు, సైలెంట్‌గా మోసుకుంటున్న బాధలను నేను దగ్గరగా చూశాను. మీరు ఆశించే మార్పు కోసం చూపుతున్న కట్టుబాటు మనందరికీ ప్రేరణ. ఈ ఏడాది అయినా హడావుడి మధ్యలో కొంత శాంతిని పొందాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీతో నడవడం నాకు గర్వకారణం” అని ఆమె పేర్కొన్నారు. ఈ సందేశం రాజకీయ నేత భార్యగా కాకుండా, జీవిత భాగస్వామిగా ఆమె వ్యక్తపరిచిన భావోద్వేగాలుగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అనేక మంది ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ బ్రాహ్మణి మాటలకు స్పందించారు.
ఇక పార్టీ పరంగా కూడా లోకేష్ పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. మంగళగిరిలో ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ స్థానికులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజును జరుపుకుంటూ, లోకేష్ నాయకత్వంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)తో పాటు తెలంగాణలోనూ టీడీపీ యువజన సంఘాలు పుట్టినరోజు వేడుకలను నిర్వహించి ఆయనకు సంఘీభావం తెలిపాయి. సోషల్ మీడియాలో #HBDNaraLokesh, #CDPofNaraLokesh వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లోకేష్ ఫొటోలతో రూపొందించిన కామన్ డిస్‌ప్లే పిక్చర్స్ (CDPs) విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ టైమ్‌లైన్స్‌ను లోకేష్ సందేశాలతో నింపుతున్నారు.