అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పాత నేరస్థులను బైండోవర్ చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను (Jakranpally Police Station) మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌ను పోలీసు సిబ్బంది తనిఖీ చేసి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులు, బ్యారక్‌లు తనిఖీ చేశారు. ఇన్వేస్టిగేషన్ కేసుల విచారణలో పక్కా ప్రణాళికతో వెళ్లాలని సూచించారు.
CP Sai Chaitanya | మర్యాదగా వ్యవహరించాలి
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని.. రిజిస్ట్రర్‌లో కూడా నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ క్రైం (cyber crimes) నేరాలు జరుగుతున్నందున యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు గ్రామస్థుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం అలర్ట్‌గా ఉండాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆర్నెళ్ల కొకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలని పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ (Jakranpally SI Mahesh), సిబ్బంది పాల్గొన్నారు.
