అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | బైక్ చోరీలకు (bike thefts) పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలో పలు చోట్ల బైక్ చోరీలు జరిగినట్లుగా ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Nizamabad City | పక్కా సమాచారంతో..
ఈ మేరకు మంగళవారం పక్కా సమాచారంతో నగరంలో తిరుగుతున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. సీసీ కెమెరా పుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్, ఇంటెలిజెన్స్ సమాచారంతో బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌కు చెందిన అమీర్‌ఖాన్, కామారెడ్డి జిల్లా (Kamareddy district) వడ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ హనీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిరువురిని రిమాండ్‌కు తరలించారు.
Nizamabad City | వాహనాలకు పటిష్టమైన లాకింగ్ వ్యవస్థ..
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో రఘుపతి మాట్లాడుతూ.. వన్‌టౌన్ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు 24 గంటలు పహారా, పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనాలకు పటిష్టమైన లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌హెచ్‌వో సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.