అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం వెలువడనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల సమగ్ర సమీక్ష తర్వాత ఒక రోజు తర్వాత ఎన్నికల సంఘం (Election Commission) ఈ ప్రకటన చేసింది. 243 స్థానాలున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించనుంది.
Election Commission | నవంబర్‌లో ఎన్నికలు..
నవంబర్ మొదటి వారంలోపు నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేసింది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు నవంబర్ మొదటి, రెండు వారాల్లోపు పూర్తి చేసే అవకాశముంది. బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో జనం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఛత్ పండుగ నేపథ్యంలో వారంతా అక్టోబర్ చివరి వారంలో తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించేలా ఛత్ పండుగ పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి.
Election Commission | మూడు దశల్లో..
243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. ఈసారి కూడా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. గతంలో 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించారు. అప్పట్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆగస్టు 2022లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీయేతో సంబంధాలను తెంచుకుంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జనవరి 2024లో నితీష్ (CM Nitish Kumar) మళ్లీ ప్లేటు ఫిరాయించారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో తెగతెంపులు చేసుకుని, మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేయనున్నాయి.