అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Moto G06 Power 5G | స్మార్ట్‌ఫోన్ల(Smart Phone)ను తయారు చేసే మోటోరోలా భారత మార్కెట్‌లో మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ సామర్థ్యంతో మోటో జీ 06 పవర్ పేరుతో తీసుకువచ్చింది. ఫ్లిప్‌కార్ట్(Flipkart), మోటోరోలా స్టోర్‌లతోపాటు ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.88 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 720 * 1640 పిక్సల్స్ రిజల్యూషన్, IP 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 2 MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందుదైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్ వాడారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఆధారిత మోటో హలో యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
బ్యాటరీ సామర్థ్యం : 7000 mAh బ్యాటరీ సామర్థ్యంతో తీసుకువచ్చిన ఈ ఫోన్.. 20w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆ సెగ్మెంట్‌లో ఇదే లార్జెస్ట్ బ్యాటరీ(Largest Battery) అని కంపెనీ చెబుతోంది.
వేరియంట్స్ : లారెల్ ఓక్(Laurel Oak), తపేస్ట్రీ(Tapestry), టెండ్రిల్(Tendril) కలర్స్‌లో లభ్యమవుతుంది.4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 7,499. ప్రస్తుతం ఈ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.
కార్డ్ ఆఫర్స్ : యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ(SBI), ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు ఉన్నాయి.