4
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Bibipet Nagareshwara Temple | బీబీపేట మండల కేంద్రంలోని నగరేశ్వర ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి(Vasavi Kanyakaparameshwari) జయంతిని మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. అనంతరం అన్నదానం చేశారు. సాయంత్రం వాసవి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగించనున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు తదితరులున్నారు.