అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhumi Pednekar | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నదే ఇప్పటి స్టార్ హీరోయిన్స్ ట్రెండ్. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్‌లలోకి అడుగుపెడుతున్నారు. సమంత, రష్మిక మందన్నా, దీపికా పదుకొణె, అలియా భట్ లాంటి టాప్ హీరోయిన్స్ ఇప్పటికే వ్యాపార రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.
ఇప్పుడు వారి సరసన బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ (Bhumi Pednekar) చేరింది. తన సోదరి సమీక్షా పడ్నేకర్‌తో కలిసి భూమి ‘బ్యాక్‌బే ఆక్వా’ (Backbay Aqua) అనే ఓ ప్రీమియం వాటర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ హిమాలయాల నుండి సేకరించిన సహజమైన మినరల్స్, ఎలెక్ట్రోలైట్స్ గల నీటిని సరఫరా చేస్తుంది.
Bhumi Pednekar | అంత కాస్ట్‌లీనా?
500 ml బాటిల్ ధర రూ. 150, 750 ml బాటిల్ ధర రూ.200గా ఉండడంతో, ఇది సాధారణ వాటర్ (Normal Water) కంటే ఖరీదైనది. అయినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఇది మేము శ్రద్ధతో రూపొందించిన ప్రీమియం వాటర్ బ్రాండ్ (Premium Water Brand). ఇది మూడు రకాల ఫ్లేవర్లలో లభ్యం అవుతుంది. ముఖ్యంగా, ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణానికి హాని చేయని పదార్థాలను ఉపయోగించాం. బాటిల్ క్యాప్స్ కూడా బయో డిగ్రేడబుల్‌గా రూపొందించాం. ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా మా లక్ష్యమనే దీని రూపకల్పన చేశాం అని వివరించింది. నేను 17 ఏళ్ల వయసులోనే సంపాదించడం ప్రారంభించాను. అప్పటి నుంచే నేను పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాను. ఆ డబ్బుతోనే ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బ్యాక్‌బే’ ప్రారంభించగలిగామని చెప్పింది.
సినిమాల్లో మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలోనూ భూమి పడ్నేకర్ తనదైన గుర్తింపు తెచ్చుకోవడంపై ఇప్పుడు ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ భూమి పడ్నేకర్ తన అందం, నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. భూమి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు చాలా మంది ఫాలోవర్లు చాలా మందే ఉన్నారు. తన ఫాలోవర్ల కోసం బ్యూటీ, ఫిట్‌నెస్ సీక్రెట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.