అక్షరటుడే, బాన్సువాడ:Bhubharathi | భూసమస్యల పరిష్కారానికి ‘భూభారతి’లో నిర్దిష్ట విధానం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. గురువారం బీర్కూరు రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అనుభవదారులు, పట్టదారుల సమస్యలు పరిష్కరించి భూ బదలాయింపునకు చర్యలు చేపడతామన్నారు. ధరణి(Dharani) లోపాలను అధిగమించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ధరణిలో సమస్యలు పరిష్కారం కాక రైతులు(Farmers) ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, ఇకమీదట అలాంటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. భూభారతితో క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ లత తదితరులు పాల్గొన్నారు.
