అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhubharati | భూభారతి దరఖాస్తులను పకడ్బందీగా విచారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. లింగంపేట (Lingampet) మండలంలోని ముంబాజీపేట గ్రామంలో సర్వేనంబర్ 151, 302లో భూసమస్యపై మంగళవారం విచారణ చేపట్టారు. ప్రతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో నరేష్, నాయబ్ తహశీల్దార్ భరత్, కార్యదర్శి పవన్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రామకృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
