అక్షరటుడే, భీమ్గల్ : Municipal Elections | భీమ్గల్ (Bheemgal) పురపాలక సంఘం పరిధిలోని 1 నుంచి 12 వార్డులకు సంబంధించిన తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) ఆదేశాల మేరకు 2026 సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు.
Municipal Elections | 24 పోలింగ్ కేంద్రాలు..
మున్సిపాలిటీలో మొత్తం 24 తుది పోలింగ్ కేంద్రాల జాబితాతో పాటు, పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను కూడా అందుబాటులో ఉంచారు. ప్రజల పరిశీలన కోసం ఈ జాబితాలను స్థానిక మున్సిపల్ కార్యాలయం (Municipal Office), తహశీల్దార్ కార్యాలయం, ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో (Collector Office)ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్లు తమ పేర్లను, పోలింగ్ కేంద్రాల వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.