అక్షరటుడే, భిక్కనూరు: Science Festival | చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో (Punjab University) డిసెంబర్ 6 తేదీ నుంచి ’ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2025 జరగనుంది.
ఈ సైన్స్ ఫెస్టివల్‌కు (science festival) భిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు తమ్మలరాజు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు లేఖ అందింది. సైన్స్ ఉపాధ్యాయులు తాము సమర్పించే ప్రాజెక్ట్‌లు, వారి నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఈ సైన్స్ ఫెస్టివల్ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, పరిశ్రమ నాయకులను, కమ్యూనికేషన్లు, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చడం సైన్స్ ఫెస్టివల్ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఫెస్టివల్‌కు ఎంపికైన తమ్మలరాజును మండల విద్యాధికారి రాజ గంగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్, ఉపాధ్యాయులు భవాని, సరిత, ప్రసన్న, శ్రీమతి అభినందించారు.
