Homeబిజినెస్​Stock Market | రాణించిన షేర్లు.. లాభాల్లో సూచీలు

Stock Market | రాణించిన షేర్లు.. లాభాల్లో సూచీలు

Stock Market | సూచీలన్నీ లాభాలతో ముగిశాయి ఐటీ(IT), మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ వంటి అన్ని రంగాల షేర్లు దీంతో సెన్సెక్స్‌ 398 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఐటీ(IT), మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ వంటి అన్ని రంగాల షేర్లు రాణించాయి. దీంతో సూచీలన్నీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 398 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగాయి.

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌(Q2 earning season) ప్రారంభానికి ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో జోష్‌ కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు తొలుత ఒడిదుడుకులకు లోనయినా తర్వాత క్రమంగా పెరిగాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 127 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 28 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా పైకి ఎగబాకాయి. సెన్సెక్స్‌ 81,667 నుంచి 82,247 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,024 నుంచి 25,199 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 398 పాయింట్ల లాభంతో 82,172 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 25,181 వద్ద స్థిరపడ్డాయి.

అన్ని రంగాలూ గ్రీన్‌లోనే..

దాదాపు అన్ని రంగాల ఇండెక్స్‌లు గ్రీన్‌లోనే ముగిశాయి. బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2.16 శాతం పెరగ్గా.. కమోడిటీ 1.34 శాతం, ఐటీ ఇండెక్స్‌ 1.13 శాతం, హెల్త్‌కేర్‌ 0.84 శాతం, పీఎస్‌యూ 0.75 శాతం, రియాలిటీ 0.74 శాతం, ఇన్‌ఫ్రా 0.71 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.64 శాతం, పవర్‌ 0.63 శాతం లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.75 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.57 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.18 శాతం లాభంతో ముగిశాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,099 కంపెనీలు లాభపడగా 2,080 స్టాక్స్‌ నష్టపోయాయి. 171 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 155 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 149 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 3 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్‌ 2.65 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.21 శాతం, సన్‌ఫార్మా 1.64 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.50 శాతం, బీఈఎల్‌ 1.42 శాతం పెరిగాయి.

Top Losers : యాక్సిస్‌ బ్యాంక్‌ 0.90 శాతం, టైటాన్‌ 0.41 శాతం, మారుతి 0.21 శాతం, టాటామోటార్స్‌ 0.18 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.16 శాతం నష్టపోయాయి.