Homeటెక్నాలజీWhats App | వాట్సాప్‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్.. త్వ‌ర‌లోనే అందుబాటులోకి..

Whats App | వాట్సాప్‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్.. త్వ‌ర‌లోనే అందుబాటులోకి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Whats App | భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ కంపెనీ యూజర్ల కోసం అనేక ప్రత్యేక‌ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్(whatsapp) తన వినియోగదారుల కోసం చాటింగ్‌ను మరింత సరదాగా చేసే అనేక కొత్త ఫీచర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్‌. ఈ ఫీచర్ iOS, Android వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ తన విండోస్ బీటా యాప్ వినియోగదారులకు కొత్త, మెరుగైన అనుభవాన్ని అందించడం ప్రారంభించింది.

Whats App | సూప‌ర్బ్​ ఫీచ‌ర్..

ఈ అప్‌డేట్‌లో కొత్త ఇంటర్‌ఫేస్, ఛానెళ్లు, కమ్యూనిటీలు వంటి కొత్త లక్షణాలు జోడించింది. ఈ అప్‌డేట్ మే 16, 2025న విడుదలైంది. దీంతో ఇప్పుడు ఆధునిక డిజైన్, WhatsApp వెబ్ వంటి ఫీచర్లు Windows యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ సౌకర్యాలు మొబైల్, మాక్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా వాట్సాప్ తెచ్చిన కొత్త ఫీచ‌ర్ ప్ర‌కారం ఫొటోలు, వీడియోలే మ‌న‌కు న‌చ్చేలా ఆటో డౌన్​లోడ్ చేసుకునేందుకు సంస్థ క‌ల్పించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ సెట్టింగ్ ఆప్ష‌న్స్​లో ఆటో డౌన్‌లోడింగ్ ఆప్ష‌న్ సరి చేసుకుంటే స‌రిపోతుంది.

కొత్త అప్‌డేట్ వాట్సాప్ వెబ్ లాగా కొత్త, అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు విండోస్ యాప్‌కి “ఛానెల్స్” అనే కొత్త ట్యాబ్, “కమ్యూనిటీస్” అనే విభాగం జోడించింది. ఇది యాప్‌లను అమలు చేయడం, కంటెంట్‌ను నిర్వహించడం గతంలో కంటే సులభం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్‌లో వాట్సాప్‌ ఒకటి. కోట్లాది మంది యూజర్లను దృష్టిలో పెట్టుకొని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ వస్తున్నది. తాజాగా సరికొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దాని సహాయంతో యూజర్లు సొంతంగా కస్టమ్‌ ఏఐ చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు.

Must Read
Related News