అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bengaluru Traffic | ప్రపంచంలో ట్రాఫిక్ రద్దీ (Traffic Congestion) పరంగా రెండో స్థానంలో ఉన్న బెంగళూరు నగరం, ప్రతిరోజూ ప్రయాణికులకు నరకాన్ని చూపుతూనే ఉంది. అయితే ఈ ట్రాఫిక్ ఒక వ్యక్తి జీవితాన్ని అనుకోకుండా మార్చింది.
బెంగళూరు ట్రాఫిక్ వలన అతడు 8 కిలోల బరువు తగ్గి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకున్నాడు. సదరు వ్యక్తి వివరాల ప్రకారం, అతడు ప్రతి రోజు వైట్‌ఫీల్డ్ నుండి కొరమంగళ (Whitefield to Koramangala) వరకు ఆఫీసుకు వెళ్ళేవాడు. ఈ ప్రయాణానికి సుమారు 90 నిమిషాలు పడేది, అందువల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురిచేసేది. ఆఫీసులో ఎక్కువ సమయం కూర్చోవడం, ఇంటికి చేరుకున్న తర్వాత అలసిపోవడం వలన వ్యాయామం చేయడానికి సమయం దొరకకపోవడం అతడిని కష్టపెట్టింది.
Bengaluru Traffic | ట్రాఫిక్ వలన..
సదరు వ్యక్తి తన అనుభవాన్ని సోషల్ మీడియా (Social Media)లో పంచుకుంటూ, ట్రాఫిక్ కారణంగా తన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసినట్లు వివరించారు. అతడు వారంలో మూడు రోజులు ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించి, ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న జిమ్‌లో వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. అలాగే, బయట ఫుడ్ ఆర్డర్ చేయడం మానేసి, దగ్గరలోని రెస్టారెంట్లకు నడిచి వెళ్లే విధంగా మార్పులు చేశాడు. ఈ మార్పుల వల్ల అతడి ఆరోగ్యం మెరుగుపడింది; రెస్టింగ్ హార్ట్ రేట్ 82 నుండి 64కి పడిపోయింది మరియు పెద్దగా ప్రయత్నించకుండానే సుమారు 8 కిలోలు బరువు తగ్గినట్లు ఆయన తెలిపారు. అతని మాటల్లో చెప్పాలంటే, “ట్రాఫిక్ మెరుగుపడలేదు. అందుకే నేను దానితో పోరాడటం మానేశాను. ఫలితంగా నా జీవితం మారింది.”
సోషల్ మీడియాలో అతడి పోస్ట్ కు విపరీతమైన స్పందన లభించింది. అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకంతో తమ ఆరోగ్యం ఎలా మెరుగైందో వివరించారు. ఒక యూజర్ వ్యాఖ్యానించారు, “నేను ఒక సంవత్సరం పాటు బస్సులో ప్రయాణించాను. రెండు స్టాప్‌లలో బస్సులు మారాల్సి వచ్చింది. సుమారు 45 నిమిషాలు పడేది. ఆ సమయంలో నేను ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. అయితే, కొన్ని కామెంట్స్‌లో వాదన వేరే విధంగా ఉంది.. అతడి బరువు తగ్గడం ట్రాఫిక్ కారణంగా కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) వల్ల సాధ్యమైందని పేర్కొన్నారు. ఆఫీసుకు వెళ్లే అవసరం లేకపోవడం వలన అతడు సొంత సమయాన్ని జిమ్‌కి మరియు ఆరోగ్యకరమైన ఆచరణలకు ఉపయోగించుకున్నాడు. ఈ సంఘటన వెనుక వాస్తవానికి వ్యక్తి జీవనశైలి మార్పే కారణమని చాలామంది నెటిజన్లు గుర్తించారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం మరియు ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించబడింది.