84
అక్షరటుడే, గాంధారి: Bear | గాంధారి మండలంలో (Gandhari mandal) ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. దీంతో గుర్జాల తండావాసులు (Gurjala Thanda) ఆందోళన చెందుతున్నారు.
తండా శివారులో పశువులు మేపుతున్న కాపర్లకు ఎలుగుబంటి కనిపించడంతో వారు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు (forest department officials) సమాచారాన్ని చేరవేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో హేమచందన మాట్లాడుతూ.. తండావాసులు అడవుల వైపు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. రాత్రిపూట పంటలకు కాపలా వెళ్లేవారు మంట వేసుకుని ఉండాలన్నారు.