CP Sai Chaitanya | చలికాలంలో పొగమంచుతో జాగ్రత్త..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | చలికాలం దృష్ట్యా రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకుని ఉంటుందని.. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పోలీస్​ కమిషనరేట్​ (Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మారుమూల రహదారుల్లో ఉదయం 11 గంటల వరకు కూడా పొగమంచు ఉంటుందన్నారు. దీంతో రహదారులపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | చలికాలం దృష్ట్యా రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకుని ఉంటుందని.. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

పోలీస్​ కమిషనరేట్​ (Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మారుమూల రహదారుల్లో ఉదయం 11 గంటల వరకు కూడా పొగమంచు ఉంటుందన్నారు. దీంతో రహదారులపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించవని.. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

CP Sai Chaitanya | ద్విచక్ర వాహనాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పొగమంచు ఉన్న ప్రదేశాల్లో బైకర్లు నెమ్మదిగా వెళ్లాలన్నారు. లోబీమ్ లైట్​ను మాత్రమే వాడాలని పేర్కొన్నారు. అవసరం నిమిత్తం ఇండికేటర్లు వాడాలన్నారు. రోడ్డుకు ఎడమ వైపు లేదా కుడివైపు వాహనం తిప్పేటప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్లు (Indicators) వాడాలని తెలిపారు. రోడ్డు తడిగా ఉంటే వాహనం స్కిడ్ అయ్యే అవకాశం గలదన్నారు. తప్పనిసరిగా హెల్మెంట్ వాడాలని సీపీ సూచించారు.

CP Sai Chaitanya | ఫోర్​ వీలర్​ వాహనాలు..

ప్రతి వాహనం వేగం తగ్గించి నెమ్మదిగా నడపాలని సీపీ సూచించారు. ముందున్న వాహనానికి కనీసం 50-100 అడుగుల దూరం ఉండేటట్లు జాగ్రత్త పడాలన్నారు. లో బీమ్ లైట్లు మాత్రమే వాడాలన్నారు. అద్దాలను కొద్దిగా తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. దీని వలన ఫాగింగ్ నివారించవచ్చన్నారు. లైన్ మార్కింగ్​లు, రోడ్డు డిఫ్లేక్టర్లను గమనిస్తూ వాహనం నడపాలని చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...