అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు (BC students) విద్యా ఉద్యోగ రంగాలలో 42శాతం రిజర్వేషన్ కల్పిచాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration) ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, మరి ముఖ్యంగా బీసీ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. నెలకు రూ.700 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ అవి ఎవరికి అందుతున్నాయో అర్థం కావట్లేదని ఆయన పేర్కొన్నారు.
చివరకు రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకు రుణ కిస్తీలు (bank loan installments) కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంబడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ జాక్ కోఆర్డినేటర్ డాక్టర్ దేశబోయిన రమ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతన సవరణ చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.
రిజర్వేషన్ల ఉద్యమంలో రాజీలేదని, ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు (BC employees) రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. త్వరలో లక్షలాది బీసీలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ రాసూరి జ్ఞానేశ్వర్, కార్యదర్శి మహేంద్ర సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు బుస్సా ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరిపే రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, దయానంద్, బసవ సాయి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.