Homeక్రీడలుIND vs SA | భారత్​ భారీ స్కోర్​.. సౌత్​ ఆఫ్రికా టార్గెట్​ 350

IND vs SA | భారత్​ భారీ స్కోర్​.. సౌత్​ ఆఫ్రికా టార్గెట్​ 350

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్​ చేసింది. రోహిత్​–కోహ్లీ జంట చెలరేగడంతో నిర్ణిత 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డే లో భారత్ (Bharat) భారీ స్కోర్​ చేసింది. రోహిత్​ (Rohit)–కోహ్లీ (ohli) జంట చెలరేగడంతో నిర్ణిత 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది.

రాంచిలో జరుగుతున్న తొలిమ్యాచ్​లో సౌత్​ ఆఫ్రికా టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్​శర్శ, జైశ్వాల్ (Jaiswal) దూకుడు ఇన్నింగ్స్​ ఆరంభించారు. అయితే ఆదిలోనే జైశ్వాల్ 18 బర్గర్​ బౌలింగ్​లో డికాక్​కు క్యాచ్​ ఇచ్చి అవుట్​ అయ్యాడు. అనంతరం విరాట్​ కోహ్లీతో కలిసి రోహిత్​ ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు. వీరుద్దరు కలిసి 109 బంతుల్లో 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్​ 5 ఫోర్లు 3 సిక్స్​లతో హాప్​ సెంచరీ చేశాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్​ వద్ద శర్మ ఔట్​ అయ్యాడు. అనంతరం కోహ్లీ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. వన్డే కెరీర్లో 52వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఫోర్లు, 7 సిక్స్​లతో 120 బంతుల్లో 135 పరుగులతో రాణించాడు.

IND vs SA | రాణించిన రాహుల్​

మ్యాచ్​లో రుత్​రాజ్​ గైక్వాడ్​ 8, వాషింగ్టన్​ సుందర్​ 13 విఫలం అయ్యారు. కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ (kl rahul )​ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి 74 బంతుల్లో 76 పరుగులు చేశారు. కోహ్లీ ఔట్​ అయిన తర్వాత జడేజాతో కలిసి రాహుల్​ మ్యాచ్​ను ముందుకు తీసుకు వెళ్లాడు. రాహుల్​ 56 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా చివర్లో మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో 32 పరుగులు చేశాడు. దీంతో భారత్​ 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.

Must Read
Related News