అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad City | తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు (culture and traditions) ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తోందని పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజా సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్లను నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో (Womens Polytechnic College) బుధవారం ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మన సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. విద్యార్థినులు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పావని, నాగరాజు, చంద్ర, విజ్నేష్, సరస్వతి, విజయత, సుజాత పాల్గొన్నారు.