HomeతెలంగాణBathukamma | అలిగిన బతుకమ్మ.. అని ఎందుకు అంటారో తెలుసా..

Bathukamma | అలిగిన బతుకమ్మ.. అని ఎందుకు అంటారో తెలుసా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma | బతుకమ్మ పండగ (Bathukamma festival) అంటేనే తెలంగాణ వీధుల్లో పూల సందడి,రంగుల హరివిల్లు, ఆడపడచుల ఆటాపాటలతో పండుగ వాతావరణం నెలకొంటుంది ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ పండుగ, అటుకుల బతుకమ్మ (Atukula Bathukamma), ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకల అనంతరం ఆరో రోజుకు చేరుకుంటుంది.

Bathukamma | ఆరో రోజు: అలిగిన బతుకమ్మ

బతుకమ్మ పండుగలో ఆరవ రోజును ‘అలిగిన బతుకమ్మ’ (Aligina Bathukamma) అని పిలుస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని భక్తులు (Devotees) నమ్ముతారు. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం బతుకమ్మను పేర్చుతున్నప్పుడు అనుకోకుండా మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట.

అందుకే అమ్మవారు అలకబూనారని చెబుతారు. ఈ కారణంగానే ఆ రోజు బతుకమ్మను పేర్చడం, ఆడటం, నైవేద్యం సమర్పించడం వంటివి ఏమీ చేయరు. అమ్మవారి అలక తీరాలని భక్తులు ప్రార్థిస్తారు. తొమ్మిది రోజుల పండుగలో ఇది ఒక విరామ దినం. మళ్ళీ ఏడో రోజు నుంచి వేడుకలు తిరిగి ఉత్సాహంగా మొదలవుతాయి.

Must Read
Related News