అక్షరటుడే, ఇందూరు: Bathukamma decoration competitions | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని రోజుకో అవరాతంలో భక్తి శ్రద్ధలతో భక్తులు నిష్టగా కొలుస్తున్నారు.
మరోవైపు ఆలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు Bathukamma celebrations కొనసాగుతున్నాయి. సంస్కార భారతి ఇందూరు మహానగర్ ఆధ్వర్యంలో బతకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయాన్ని స్వర్ణాలంకరణ శోభితంగా ముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ అలంకరణను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Bathukamma decoration competitions | బతుకమ్మ అలంకరణ పోటీలు..

Sri Vasavi Kanyaka Parameshwari Temple లో బుధవారం మహిళలకు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. ప్రకృతి ఆరాధన పూల పండుగలో అతివలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అందమైన కుసుమాలతో సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను ఎంపిక చేశారు. దీంతపాటు పాటల పోటీలు కూడా నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వాసవీ కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు పాల్తి రవికుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర గుప్తా, కోశాధికారి మామిడి శేఖర్ గుప్తా, సంస్కార భారతి మాతృశ్రీ కన్వీనర్ సముద్రాల మాధురి, వరలక్ష్మి, శ్రీలత, నాగుర్తి శంకర్, రమణాచారి, కందకుర్తి ఆనంద్, పవన్ కుమార్, బెజ్జం శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, బున్ని తదితరులు పాల్గొన్నారు.
