అక్షరటుడే, ఆర్మూర్: Bathukamma | పట్టణంలోని సిద్దార్థ డిగ్రీ కళాశాలలో (Siddhartha Degree College) బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలను పేర్చి, మధ్యలో గౌరమ్మను కొలిచి, ఆటపాటలతో, ప్రత్యేక నైవేద్యాలతో బతుకమ్మను పూజించి, నీటిలో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి (Telangana culture) ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాకేష్, బాలరాజ్, అరవింద్, రాజశేఖర్, శ్రీధర్, ప్రమోద్, రజనీకాంత్, అర్చన, సుమలత, నిఖిత, నవనీత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.