అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bathukamma Celebrations | తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. కాగా.. ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ (Telangana) వాసులు సైతం వేడుకలు జరుపుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మలేసియా బతుకమ్మ సంబరాలు (Malaysia Bathukamma celebrations) నిర్వహించారు. కౌలాలంపూర్‌లోని కృష్ణ మందిరంలోని బృందావన్ హాల్, బ్రిక్ ఫీల్డ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మ అట పాటలతో సందడి చేశారు.
Bathukamma Celebrations | హాజరైన ప్రముఖులు
ఉత్సవాలకు మలేషియాకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెంబెర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పెరాక్ స్టేట్ వాసంతి సిన్ని సామి, ఇండియన్ డిప్యూటీ హైకమిషనర్ సుభాషిణి నారాయణన్, వారితో పాటుగా తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఇంద్రనీల్, కోశాధికారి నాగరాజు, మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ ప్రెసిడెంట్ శారదా, భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ ప్రెసిడెంట్ గీత హజారే, భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు కాంతారావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి, తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాశ్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మలేషియాలో భారతీయ వారసత్వానికి జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవడం, భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడంపై ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బతుకమ్మను అందరికంటే బాగా పేర్చిన వారికి బంగారు నాణెం (Gold Coin) బహుమతిగా ఇచ్చారు. అలాగే బతుకమ్మలు తీసుకొచ్చిన వారికి వెండి నాణేలు (Silver Coin) బహుమతిగా అందించారు.
కార్యక్రమంలో ఎఫ్ఎన్సీఏ సహాధ్యక్షుడు కృష్ణ ముత్తినేని, ఉపాధ్యక్షుడు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతి కుమార్ గాజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ పాల్గొన్నారు.