Indur High School
Indur High School | ఇందూర్​ హైస్కూల్​లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అక్షరటుడే, బోధన్ : Indur High School | పట్టణంలోని ఇందూర్​ హైస్కూల్​(Indur High School)లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ నాగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి(Telangana Culture)కి ప్ర​తీకగా బతుకమ్మ పండగ నిలుస్తోందని పేర్కొన్నారు.

బతుకమ్మ(Bathukamma) పండుగ అనేది తెలంగాణలో అంతర్భాగం అని అందుకే ప్రతి ఒక్క ఆడపడుచు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటుందన్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో బతుకమ్మ పండుగలో పాల్గొనడం సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కొడాలి కిషోర్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.