- Advertisement -
Homeజిల్లాలుహైదరాబాద్Bathukamma Festival | గాంధీభవన్​లో బతుకమ్మ సంబరాలు

Bathukamma Festival | గాంధీభవన్​లో బతుకమ్మ సంబరాలు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​ : Bathukamma Festival | టీపీసీసీ ఎన్​ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్(Gandhi Bhavan)​లో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుందన్నారు. బతుకమ్మ(Bathukamma) మహిళల్లో ఐక్యతను పెంచుతుందన్నారు.

బాలికలు, మహిళలు భక్తి శ్రద్ధలతో తెలంగాణ(Telangana)లో నిర్వహించుకునే ఈ పండుగ దేశంలోనే ప్రత్యేకమైందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ హైదరాబాద్​ విజయ లక్ష్మి, సాంస్కృతిక శాఖ ఛైర్మన్ వెన్నెల గద్దర్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ సెల్​ ఛైర్మన్ వినోద్ కుమార్, సభ్యులు, చెన్నమనేని శ్రీనివాస్, కార్పొరేషన్ ఛైర్మన్​ కల్వ సుజాత, రైతు కమిషన్ మెంబెర్ భవాని రెడ్డి, బొజ్జ సంధ్యారెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News