- Advertisement -
HomeతెలంగాణKavitha | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ

Kavitha | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kavitha | తెలంగాణ సంస్కృతి(Telangana Culture)ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయం(Jagruti Office)లో సోమవారం ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

మహిళా నాయకులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చి బతుకమ్మ(Bathukamma) ఆడారు. ఈ సందర్భంగా కవిత(Kavitha) మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగ మనకుందని అన్నారు. ఇలాంటి పండుగ రోజు ఆడబిడ్డలను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆడబిడ్డలకు రెండు చీరలిస్తామని గతంలో చెప్పి ఎగ్గొట్టిందన్నారు. ఆడబిడ్డలను గౌరవించడమంటే కేవలం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పడం కాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Kavitha | ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి

ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు కాంగ్రెస్​ పార్టీ(Congress Party) ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కవిత డిమాండ్​ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. నెలకు రూ. 2500లతో పాటు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలని కోరారు. పండుగకు ఇవ్వాల్సిన చీరను ‘బతుకమ్మ చీర’ పేరుతోనే ఇవ్వాలన్నారు. అంతేకాని ‘ఇందిరమ్మ చీర’(Indiramma Cheera) అని పేరు పెడితే మాత్రం ఊరుకోబోమని చెప్పారు. జాగృతి తరఫున ఇప్పటికే 110 బతుకమ్మ పాటలను విడుదల చేశామని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను నిలబెట్టేందుకు జాగృతి తరఫున నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

Kavitha | బతుకమ్మ పాట ఆవిష్కరణ

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి రూపొందించిన ‘‘బతుకమ్మ పాట 2025’’ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. మాట్ల తిరుపతి రచించిన పాటను మంగ్లీ ఆలపించగా.. ఎస్​కే మదీన్ సంగీతం అందించారు. కార్యక్రమంలో మాట్ల తిరుపతి, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News