10
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Wellness Hospitals | నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు వెల్‌నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బారికేడ్లు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్ పోలీసులకు (Traffic) వంద బారికేడ్లను ఆస్పత్రి యాజమాన్యం చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రతినిధి బోదు అశోక్ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఆర్‌ఐ వినోద్, శేఖర్, ఆర్ ఎస్సై సుమన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.