అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh women vs England women | మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s One-Day World Cup 2025) లో ఇంగ్లాండ్ జట్టు English team పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది.
మంగళవారం బంగ్లాదేశ్(Bangladesh)పై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించిన ఇంగ్లీష్ జట్టు, భారత్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఓ దశలో ఓటమి అంచున ఉన్న ఇంగ్లాండ్‌ను కెప్టెన్ హీథర్ నైట్ Captain Heather Knight తన అద్భుత ఇన్నింగ్స్‌తో గెలుపు బాట పట్టించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు England Team అద్భుత ప్రదర్శనతో మరో విజయం నమోదు చేసింది. మంగళవారం గువహాటిలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది.
ఓ దశలో ఓటమి అంచున ఉన్న ఇంగ్లాండ్, కెప్టెన్ హీథర్ నైట్ నాయకత్వంలో పుంజుకుని అద్భుతంగా గెలిచింది. దీంతో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి, భారత్‌ను వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది.
Bangladesh women vs England women | కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు Bangladesh ఇంగ్లాండ్ బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. 49.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది.
రబేయా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్) చివర్లో రాణించడంతో జట్టు 150 మార్కును దాటింది. ఇంగ్లాండ్ తరఫున ఎక్లెస్టోన్, బెల్, స్కైవర్-బ్రంట్ బౌలర్లు సత్తా చూపారు.
తక్కువ లక్ష్యాన్ని చేజ్ చేయడానికి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే తడబడింది. మొదటి ఓవర్‌లోనే ఆమీ జోన్స్ ఔట్ కాగా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి జట్టు ఒకానొక దశలో 78/5 వద్ద కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ బౌలర్లు ఆత్మవిశ్వాసంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నట్లు కనిపించింది.
అయితే ఆ సమయంలో కెప్టెన్ హీథర్ నైట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఏడో వికెట్‌కు డీన్ (27)తో కలిసి అజేయంగా 79 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించింది.
హీథర్ 111 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును 46.1 ఓవర్లలో విజయతీరాలకు చేర్చింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి +1.757 నెట్ రన్ రేట్‌తో పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచింది.
అదే రెండు విజయాలు సాధించిన భారత్ India +1.515 నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ ఈ ఓటమితో టోర్నమెంట్‌లో తమ మొదటి విజయానికై ఎదురు చూడాల్సి వచ్చింది.